18/06/2026
కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నం సాకారం, ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్, వీరవల్లి యొక్క రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా తీర్చిన సందర్భంగా, విజయవాడ ఫ్యాక్టరీ ఆవరణ లో రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు లో కేక్ కట్ చేసి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకున్న కృష్ణా మిల్క్ యూనియన్.
పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నమైన ప్రాజెక్ట్ కామధేను విజయవంతంగా సాకారమైందని కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు తెలిపారు.వీరవల్లి గ్రామంలో రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో, భవిష్యత్తులో 8 లక్షల లీటర్లకు విస్తరించే వీలున్న అత్యాధునిక పూర్తి ఆటోమేషన్ ప్లాంట్‌ను రూ.185 కోట్ల అంచనాతో ప్రారంభించి, కేవలం రూ.163 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం సమితికి ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని 7 సంవత్సరాల కాలపరిమితితో తీసుకున్నప్పటికీ, సమితి ఆర్థిక క్రమశిక్షణ, సమర్థ నిర్వహణ, పాడి రైతుల సహకారంతో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా చెల్లించడం అసాదారణ విజయమని తెలిపారు. ఈ ప్లాంట్ కు మ్యాక్ష్ చట్ట రూపకర్త కీ.శే శ్రీ నందమూరి తారక రామారావు ప్లాంట్ గా నామకరణం చేసి కృష్ణా జిల్లా రైతా౦గమునకు మరియు భవిష్యత్తు తరాలకు అంకితం చేయటం జరిగిందని ఈ సందర్భముగా తెలిపారు.
బుడమేరు వరద ముంపు సమయంలో 42 రోజులు విజయవాడ ఫ్యాక్టరీ మూతబడి 24 కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ ముందు చూపుతో నిర్మించిన కామధేను ఫ్యాక్టరీలో మొత్తం ప్రాసెసింగ్ జరిపి, పాడి రైతులు, సమితి సిబ్బంది, వినియోగదారుల సహకారంతో రోజువారీ నిర్వహణలో ఎటువంటి ఆటంకం లేకుండా సమితి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించగలిగిందని తెలిపారు.
ఈ అసాధారణ విజయానికి కారణమైన పాడి రైతులు, పాల సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు అందరికీ ఛైర్మన్ గారి మరియు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వ రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణ లో ఈరోజు నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్- పశుసంవర్ధక మరియు డెయిరీ విభాగం, కేంద్ర ప్రభుత్వం - శ్రీ దయానంద్ సావంత్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (TCMPF) మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, తమిళనాడు ప్రభుత్వం- శ్రీ అజయ్ యాదవ్, IAS గారు, NDDB సౌత్ రీజినల్ హెడ్ - శ్రీమతి రోమీ జాకబ్ గారు, అలాగే వైట్ రివల్యూషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల కు సంబంధించిన వివిధ co-operative డెయిరీ ల నుండి విచ్చేసిన చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్ల సమక్షంలో కేక్ కట్ చేసి రూ.110 కోట్ల రుణాన్ని పూర్తిగా చెల్లించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని కృష్ణా మిల్క్ యూనియన్ ఘనంగా జరుపుకున్నది.
ఈ సందర్భంగా వారందరూ కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారికి, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గారిని పూల మాలతో ఘనంగా సత్కరించారు.
ఈ వార్త ఈరోజు పలు దిన పత్రికలలో ప్రచురితమైనది.