07/01/2026
పత్రికా ప్రకటన
*మంగళగిరిలో ఉరుస్సు మరియు గంధ మహోత్సవం* *హాజరత్ సయ్యద్ మాలక్ హుస్సేన్ అవులియా వారి 58వ ఉరుసు మరియు గంధ మహోత్సవం*
*ది.09-1-2026, 10-1-2026, తేదీల్లో వైభవంగా జరుగు వేడుకలకు*
*- భక్తులు తరలి రావాలని దర్గా ట్రస్టీ ఉస్మాన్ షరీఫ్ గారి పిలుపు*
మంగళగిరి: రెండు శతాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాజరత్ సయ్యద్ మాలక్ హుస్సేన్ అవులియా దర్గాలో ఉరుసు మరియు గంధ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ మొహమ్మద్ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మంగళగిరిలోని పార్క్ రోడ్డు వద్ద నుండి ఉరుస్సు గంధము ఊరేగింపు ది.09-01-2026 శుక్రవారం రాత్రి 10గం|లకు, పకీర్లు సన్నాయి, బ్యాండ్ మేళలతో ఊరేగింపుగా బయలుదేరి శనివారం ఉదయం ఈ యస్ ఆర్ గార్డెన్స్ వెనుక దర్గా వద్దకు చేరును, గంధము, ఫతేహ, ప్రసాదము జరుగును. ది.10-01-2026 శనివారం సాయంత్రం 7గం||లకు దీపారాధన, తదుపరి అన్నదాన ప్రసాదము పంపిణీ జరుగును, రాత్రి 10 గంటలకు విజయవాడ నుంచి వారితో గొప్ప 'ఖవాలి ప్రోగ్రాం' నిర్వహిస్తామని ట్రస్టీ ఉస్మాన్ షరీఫ్ వివరించారు. భక్తులు ఈ ఉరుసు మరియు గంధ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.సెల్ : 94404 77880