05/03/2026
"సందేహించకుమమ్మా..
రఘురాము ప్రేమను సీతమ్మా"..
చిత్రం -- లవకుశ (1963)
సాహిత్యం -- సముద్రాల
సంగీతం -- ఘంటసాల
గానం -- ఘంటసాల
సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినదీ.. అంతటి మహాసాధ్వి సీతాదేవి ఎలా ఉంటుందో మనకు తెలియదు.. కాని "అమ్మా సీతమ్మా" అనగానే కనులముందు తిరుగాడే రూపం అంజలీదేవి గారిది.. 🌷🙏🌷
"రఘుకులేశుడే ధర్మము వీడీ.. మరో భామతో కూడిన నాడు.." ఆ తలపే భరించలేనంత భావాన్ని ఎవరు చూపించగలరు..? అదే వాల్మీకి మహర్షి మనోభావం.. "నాదు జపము తపము.. నా కావ్యమ్మె వృథ యగునమ్మా.." రాముడి మీద తన నమ్మకాన్ని తన హావభావాలతో అపర వాల్మీకి లా మనకు దర్శన మిచ్చిన చిత్తూరు నాగయ్య గారి నటన మరువగలమా..? ఘంటసాల గారి పాటలు, పద్యాలు.. తెలియని వారు ఉండరేమో..👌👌🙏🌹🙏
అలనాటి "లవకుశ" చిత్రంలోని ఈ పాటను మనసుకు హత్తుకునేలా ఆలపించిన మన అభిమాన గాయకులు శ్రీ డి ఎ మిత్రగారి మరో ఆణిముత్యం...💐💐
This video is posted for group entertainment only.